NewsWaves.news

స‌త్తెన‌ప‌ల్లిలో వైకాపా నేతల ధ‌ర్నా, అరెస్ట్

    ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో అఖిల‌ప‌క్ష నేత‌లు ధ‌ర్నా చేశారు. కోడెల‌, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని అఖిల‌ప‌క్ష నాయ‌కులు ధ్వ‌జ‌మెత్తారు.కోడెల కుటుంబం అవినీతితో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

స‌త్తెన‌ప‌ల్లి తాలూకా సెంట‌ర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సహా పలువురు సీపీఐ, సీపీఎం, జనసేన, ఆప్, కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కోడెల శివప్రసాదరావు  అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కోడెల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అయితే ధ‌ర్నాకు అనుమ‌తి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేశారు.

 .

Related Articles