NewsWaves.news

లోకేష్ మతిస్థిమితం బాగాలేదు… విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “డియర్ లోకేష్.. మీ నాన్న చంద్రబాబును ఓడించడానికి మా కళ్ళ ముందు నువ్వు ఉండగా.. ఇంక మోడీ, కేసీఆర్ లతో మాకు ఏం పని చెప్పు?తప్పమ్మా లోకేష్ ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయి. లెంపలేసుకో… ” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

అంతే కాదు మరొక ట్వీట్ లో.. “జగన్ లోను అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ లోను మోడీ కనిపిస్తున్నారా! ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని ట్వీట్ చేశావు? ప్రధాని మోదీ సంగతి తర్వాత ఆలోచిద్దువు కానీ ముందుగా నీ బాడీ, మరీ ముఖ్యంగా నీ మైండ్ సంగతి ఆలోచించు. ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించుకో, మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్ళు మంత్రులుగా ఉండటానికి అనర్హులు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.

Related Articles