NewsWaves.news

లండన్ కు జగన్ దంపతులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన సతీమణి భారతితో కలిసి జగన్ లండన్ కి బయలుదేరి వెళ్లారు. లండన్ లో చదువుకుంటున్న తన కూతురును కలిసేందుకు జగన్ దంపతులు లండన్ వెళ్లినట్లు సమాచారం.

నిజానికి గత నెలలోనే ఈ పర్యటన చేయాల్సి ఉండగా.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అధికార పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు ఉన్న నేపథ్యంలో జగన్ రాష్ట్రంలోనే ఉండాల్సి వచ్చింది. అన్ని కార్యక్రమాలు చక్కదిద్దుకున్న అనంతరం జగన్ దంపతులు లండన్ బయలుదేరి వెళ్లారు. తిరిగి ఈ నెల 26న జగన్ హైదరాబాద్ కి రానున్నారు.

Related Articles