NewsWaves.news

బాండ్ పేపర్ రాసిస్తేనే బి ఫారం ఇస్తామంటున్న కాంగ్రెస్…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచి,ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ లోకి ఫిరాయింపులు చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ మారబోమని బాండ్ పేపర్ రాసిస్తేనే బీ ఫారం ఇస్తామంటూ నిబంధన విధించింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ మారబోమని బాండ్ పేపర్ మీద రాసి, సంతకం పెట్టిన వారికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కేటాయించి బీ ఫారం ఇస్తామని హస్తం పార్టీ వెల్లడించింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించే అభ్యర్థులు విజయం తర్వాత కూడా పార్టీని మారాబోమని బాండ్ పేపర్ మీద రాసి ఇస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి