NewsWaves.news

అక్ష‌య తృతీయ‌…ఇలా చే్ద్దాం..!

వైశాఖ శుక్లపక్ష త‌దియను అక్షయ తృతీయ ప‌ర్వదినంగా చెప్పుకుంటాం. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథి అని అర్థం. ఈ రోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా ఫ‌ల‌వంతమవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు బంగారం, వెండి కొన‌డంతో పాటు చేసే దానాలు కూడా అక్షయ‌మైన ఫ‌లితాన్నిస్తాయి. దానం చేయ‌డంవ‌ల్ల గ్రహ దోషాలు, పూర్వ కర్మ ఫలితాల తొలగిపోతాయి. శ్రీమహావిష్ణువును చందనంతో పూజిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అక్షయ తృతీయ రోజున జపం,హోమం, పితృ తర్పణం, దానం అక్షయ ఫలితం లభిస్తుంది.

నిత్యం భగవ‌దారాధనలో గ‌డిపేవారికీ దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి, స‌క‌ల శుభాలు చేకూరుతాయి. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని దానాలు ఇవ్వాలి. వేస‌విలో ఉప‌శ‌మ‌నం క‌లిగించే విసనకర్ర, గొడుగు, పాదరక్షలతో పాటు య‌థాశ‌క్తి ఇత‌ర దానాలు చేయవచ్చు. ఈ రోజు ఏ పూజ చేసినా అధిక ఫలాన్ని ఇస్తుంది. పితృ తర్పణం చేస్తే పితృదేవ‌త‌లకు అక్షయ పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి. తర్పణం విడిచే కొడుకులకు పితృ దేవతల అనుగ్రహం త‌ప్ప‌క‌ లభిస్తుంది.


అక్ష‌య తృతీయ రోజున కడవ దానం చేస్తే పితృదేవ‌త‌లకు అక్షయ లోకాలను ఇవ్వటమే కాకుండా దానం చేసిన వారికి కూడా శాంతి ల‌భిస్తుంది. సముద్ర స్నాన చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. ఈ రోజు ఉపవాసం చేసినా అక్షయ ఫలితం ద‌క్కుతుంది. ఈ రోజు చేసే హోమాలు, దానాలు, పితృదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా ఉంటాయి కాబట్టి దీనికి అక్షయ తృతీయని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు ద‌ర్మ‌రాజుకు తెలియజేశాడు.అక్షయ తృతీయ నాడు పాదరక్షలను పేదలకు దానం చేయడం ద్వారా నరకబాధలుండవు.

అక్షయ తృతీయనాడు నారికేళాన్ని దానం చేయడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. తమలపాకులను దానం చేయడం వలన ఉద్యోగాలలో పదోన్నతులు, వ్యాపారలాభాల అక్షయ తృతీయ నాడు పాదరక్షలను పేదలకు దానం చేయడం ద్వారా నరకబాధలుండవు. నారికేళాన్ని దానం చేయడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. తమలపాకులను దానం చేయడం వలన ఉద్యోగాలలో పదోన్నతులు, వ్యాపారలాభాలుంటాయి. కుంకుమ దానం చేయడం వలన ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షయమై వెలుగొందుతుంది.
అక్షయ తృతీయ రోజు ఉదకుంభ దానం విశిష్టమైంది. రాగి లేదా వెండి కలశంలో కుంకుమపువ్వు, కర్పూరం, తులసి, వక్క కలిపిన నీటిని దానం చేస్తే వివాహ ప్ర‌య‌త్నాల‌లో అడ్డంకులు తొలిగిపోయి స‌త్వ‌ర‌మే వివాహ‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంది. సంతాన‌లేమితో బాధ‌ప‌డేవారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. చందనం దానం చేస్తే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. పరుపులు దానం చేస్తే సంతోషం చేకూరుతుంది.
అక్షయ తృతీయ శ్రీమహావిష్ణువుకు, శ్రీమహాలక్ష్మికి ప్రీతిపాత్రం కావడంతో ఇత‌ర‌త్రా ఆలోచ‌న‌లు చేయ‌కుండా ఆధ్యాత్మిక, ధార్మిక చింత‌న‌లో వీలైనంత ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాలి. శక్తి కొద్దీ దానం చేయాలి. దాన‌ధ‌ర్మాల‌పై దృష్టి సారించాలి.
అక్ష‌య తృతీయ రోజున సింహాచ‌లం క్షేత్రంలో శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారికి అత్యంత వైభ‌వంగా చందనోత్స‌వం నిర్వ‌హిస్తారు. స్వామివారి నిజ‌రూప ద‌ర్శ‌నానికి వేలాదిమంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి