NewsWaves.news

చెన్నైలో టీచ‌ర్ దారుణ హ‌త్య‌

చెన్నైలో దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ప‌గ‌లే 23 ఏళ్ల యువ‌తిని దారుణంగా హత్య చేశాడు ఓ యువ‌కుడు. స‌మీపంలోని గాయత్రి మెట్రిక్యులేష‌న్ పాఠ‌శాలలో మ్యాథ్స్ చెప్పే ఎస్‌. ర‌మ్య (23) అనే యువ‌తిని.. త‌న‌ను పెళ్లి చేసుకోలేదు అనే కోపంతో ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఈ సంఘ‌ట‌న జ‌రిగే స‌మ‌యానికి ర‌మ్య ఐదో త‌ర‌గ‌తిలో పాఠం చెబుతున్నారు.


ఆ స‌మ‌యంలో చేతిలో క‌త్తితో ప్ర‌వేశించిన ఆ ఉన్మాది విచ‌క్ష‌ణా ర‌హితంగా ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాల‌కు గురైన రమ్య అక్క‌డిక్క‌డే చ‌నిపోయింది. ఈ హ‌త్య‌ను చూసిన విద్యార్ధులు భ‌యంతో బ‌య‌టికి పరుగులు తీశారు. విష‌యం తెలుసుకున్న స్కూల్ యాజ‌మాన్యం పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు.

Related Articles