NewsWaves.news

నానీ సినిమాలో ర‌కుల్ ఐటం సాంగ్‌?!

స్టార్ హీరోయిన్‌.. పైగా మంచి ఫామ్‌లో ఉన్నర‌కుల్ ఐటం సాంగ్ చేయ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా…కానీ త‌మ‌న్నా కూడా స్వింగ్ జ‌రా సాంగ్ చేసిన విష‌యం గుర్తింది క‌దా. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ స్పెష‌ల్ సాంగ్స్ చేసి అభిమానుల‌ను అల‌రిస్తుంటారు.

అయితే కెరీర్ మంచి ఊపుమీదున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా నానీ మూవీలో ఐటెం సాంగ్ చేయ‌నుంద‌నే వార్త‌లొస్తున్నాయి. నానీతో ఇటీవ‌లే సినిమా ప్రారంభించిన విక్ర‌మ్‌కుమార్, ర‌కుల్‌తో ఒక ప్రత్యేక సాంగ్ చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. వెంట‌నే ర‌కుల్ ను అడిగాడ‌ట‌. అయితే ఈ అమ్మ‌డు ఇంకా ఓకే చెప్ప‌లేద‌ని స‌మాచారం. కెరీర్ ఆరంభం నుంచి ఐటం సాంగ్స్ చేయ‌డానికి ఆస‌క్తి చూప‌ని ఆ పంజాబీ బ్యూటి మ‌రి నానీ కోసం ఆ రూల్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి మ‌రి!

Related Articles