NewsWaves.news

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయను : రజనీకాంత్

రానున్న లోకసభ ఎన్నికల్లో తాను గానీ, తమ పార్టీగానీ పోటీ చేయడం లేదంటూ తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. తమ టార్గెట్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు కూడా తెలపడం లేదంటూ ఆయన స్పష్టత ఇచ్చారు. ఇతర పార్టీలు గానీ, తన అభిమాన సంఘాలు గాని పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు రజనీకాంత్. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రానికి నీటి సమస్యలు లేకుండా చేయగలిగే పార్టీకే ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు రజనీ.

Related Articles