NewsWaves.news

జావేద్ అక్తర్ కళ్లు పీకి,నాలుక కోస్తాం… కర్ణిసేన

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ కొన్ని సందర్భాల్లో అవి శృతి మించుతు ఉంటాయి. తాజాగా భారత్ లో ముస్లిం మహిళలు ధరించే బుర్కా విషయంపై శివసేన పార్టీ చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది విమర్శిస్తున్న విషయం తెలిసిందే.అయితే బుర్ఖాలే నిషేధించడం ఎందుకు, మహిళలు తలపైన కప్పుకునే కొంగు విధానాన్ని కూడా నిషేధించాలంటూ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ వ్యాఖ్యానించారు.

అయితే జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర కర్ణిసేన చీఫ్ జీవన్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యల పైన జావేద్ అక్తర్ మూడు రోజులలోపు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో అతని కళ్లు పీకేస్తామని,నాలుకని కోసేస్తామని,ఇంట్లోకి వెళ్లి మరీ చితకబాదారు తాము అని జీవన్ సింగ్ తీవ్రంగా హెచ్చరించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి