NewsWaves.news

జ‌గ‌న్ ను నాగార్జున అందుకే క‌లిశారు : కృష్ణంరాజు

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున ఇటీవ‌లే వైకాపా అధినేత జ‌గ‌న్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయ నాయ‌కుల‌తో ఏ ప్ర‌ముఖుడు క‌లిసినా..దానికి రాజ‌కీయ రంగు పులమ‌డం జ‌రుగుతుంది. నాగ్‌-జ‌గ‌న్‌ల మీటింగ్ విష‌యంలో కూడా అదే జ‌రిగింది. అయితే దీపిపై టిడిపీ నేత ర‌ఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చాడు.

హీరో నాగార్జున త‌న‌కు మంచి మిత్రుడ‌న్న కృష్ణం రాజు… నాగార్జున మేన‌ల్లుడు సుమంత్‌, జ‌గ‌న్ చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్స్ అని..ఆ చొర‌వ‌తోనే నాగ్‌, జ‌గ‌న్‌కు క‌లిశార‌న్నారు. ఇందులో ఎలాంటి రాజ‌కీయ కోణం లేదన్నాడు. ఇక త‌ను పార్టీ మారుతున్నాను అని వ‌స్తున్న పుకార్ల‌లో వాస్త‌వం లేద‌న్నాడు కృష్ణం రాజు.

Related Articles