NewsWaves.news

ప‌దేళ్లు పూర్తి చేసుకున్న వాట్సాప్‌

కోట్లాది మంది జీవితాల‌తో సాంకేతిక బంధం పెన‌వేసుకున్న వాట్సాప్ ఇవ్వాల్టితో 10 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఆరంభంలో కేవ‌లం సందేశాలు పంప‌డానికి మాత్ర‌మే అనుకొని యాండ్రాయిడ్, ఐఫోన్ వినియోగ‌దారుల కోసం లాంచ్ చేశారు. అనంత‌రం వెబ్ వ‌ర్ష‌న్ కూడా విడుద‌ల చేశారు. ఇందులో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌, లోకేష‌న్‌, కాంటాక్ట్స్ కూడా పంపించే ఫీచ‌ర్స్ తీసుకొచ్చారు. దీంతో కోట్లాది మంది మొబైల్స్ లో ఈ యాప్ చేరిపోయింది.


ఇప్ప‌టికీ ఎన్ని మెస్సెజింగ్ యాప్స్ వ‌చ్చినా వాట్సాప్‌కు తిరుగులేదు. తాజాగా వ‌చ్చిన వాట్సాప్ పే, వాట్సాప్ బిజినెస్ కూడా వినియోగ‌దారుల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఎటొచ్చి ఫేక్ న్యూస్ కూడా ఎక్కువ‌గా షేర్ అయ్యేది వాట్సాప్ వ‌ల్లే కాబ‌ట్టి ఈ మ‌ధ్యే ఫ‌ర్వార్డ్ మెసేజ్‌ల సంఖ్య త‌గ్గించ‌డానికి ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంది ఈ సంస్థ‌. వీటితో పాటు వాట్సాప్‌ను హింస‌కోసం, లేదా ఏదైనా అసాంఘిక ప్ర‌యోజ‌నాల కోసం వినియోగిస్తే వారిని బ్యాన్ చేస్తుంది వాట్సాప్‌.

Related Articles