NewsWaves.news

వాట్సాప్ లో వాయిస్‌తో టైపింగ్ చేసే ఫీచర్ వ‌చ్చేసింది

ప్ర‌పంచ వ్యాప్తంగా వంద‌ల కోట్ల మంది వినియోగ‌దారులున్న వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్ తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అదే కోవ‌లే ఇప్పుడు మ‌రో ఉప‌యోగ‌క‌ర‌మైన ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఇకపై మీరు మీ వాయిస్ తో కావాల్సిన సందేశాన్ని టైప్ చేసుకోవ‌చ్చు. దీని కోసం కీ బోర్డులోని మైక్‌ను ట‌చ్ చేసి కావాల్సిన స‌మాచారాన్ని వాయిస్ ద్వారా అందించాల్సి ఉంటుంది. 

యాండ్రాయిడ్ వినియోగ‌దారులు కీబోర్డు పైనే ఉన్న మైక్ ఐకాన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో ఐఫోన్ వినియోగ‌దారులకు ఈ బ‌ట‌న్ కుడి వైపు అందుబాటులో ఉంటుంది.

అయితే ఇప్పటికే యాండ్రాయిడ్ వినియోగ‌దారులు గూగుల్ ఆసిస్టెంట్‌, ఐఫోన్ వినియోగ‌దారులు సిరితో వాయిస్ మెసేజ్ పంపిస్తున్నారు. కానీ వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచ‌ర్ మ‌రింత ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

Related Articles