NewsWaves.news

పాకిస్థాన్ ని చిత్తుగా ఓడించిన వెస్టిండీస్

ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్ వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ ని వెస్టిండీస్ చిత్తుగా ఓడించింది .మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ జట్టు లో 22 పరుగుల వ్యక్తిగత స్కోరు అత్యధికం. పాకిస్థాన్ జట్టు అందరూ ఘోరంగా విఫలం అవడంతో 21 ఓవర్లకే పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. వెస్టిండీస్ బౌలర్లలో థామస్ 4 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్ 3వికెట్లు రస్సెల్ రెండు వికెట్లు సాధించాడు.

106 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. క్రిస్ గేల్ అర్థ సెంచరీ సాధించాడు .నికోలస్ 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. మూడు వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలో 106 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్తాన్ బౌలర్ అమీర్ మూడు వికెట్లు సాధించాడు. నాలుగు వికెట్లు పడగొట్టిన థామస్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి