NewsWaves.news

చెత్త రికార్డును బ్రేక్ చేసిన‌ ఇంగ్లాండ్- వెస్టిండీస్

అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో ఆడుతున్న‌ప్పుడు గ‌ల్లీ క్రికెట్లో వేసిన‌ట్టు ఊరికే వైడ్ బాల్స్ వేయ‌రు. ఎందుకంటే ప్రొఫెష‌న‌ల్ ట్రైనింగ్ తీసుకుని ఫ‌ర్ఫెక్ట్ అండ్ లెన్త్ పై గ్రిప్ ఉంటుంది. కానీ కొన్ని సార్లు బౌల‌ర్లు ఆ లైన్ అండ్ లెన్త్‌ను మ‌ర్చిపోతారు. అది కామ‌న్‌. కానీ రెండు జ‌ట్లు క‌లిసి ఒకే మ్యాచులో 38 వైడ్లు వేయ‌డం మాత్రం కామ‌న్ కాదు క‌దా. సెయింట్ లూసియాలో జ‌రుగుతున్న మూడో టెస్టుల్లో వెస్టిండీస్‌- ఇంగ్లాండ్ జ‌ట్లు క‌లిసి మొత్తం 38 వైడ్లు వేసి చెత్త రికార్డు క్రియేట్ చేశాయి. 2008లో వెస్టిండీస్ టీమ్ అప్ప‌ట్లో 34 వైడ్లు వేసి అత్య‌ధికంగా వైడ్లు వేసిన టీమ్‌గా చెత్త పేరు తెచ్చుకుంది. ఇప్పుడు రెండు టీమ్‌లు క‌లిసి ఈ చెత్త రికార్డును బ్రేక్‌ చేశాయి. అయితే ఇక అత్య‌ధిక వైడ్లు విసిరిన టీమ్స్‌లో రెండు స్థానాలు వెస్టిండీస్‌- ఇంగ్లాండ్ ఆక్ర‌మించుకోగా.. మూడో స్థానంలో 33 వైడ్ల‌తో ద‌క్షిణాఫ్రికా-భార‌త్ నిలిచాయి

Related Articles