NewsWaves.news

ప్ర‌తీకారం తీర్చ‌కుంటాం : సీఆర్ఫీఎఫ్‌

పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారం తీర్చుకుంటాం అని సెంట్రల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) తెలిపింది. జ‌మ్ముక‌శ్మీర్ పుల్వామా జిల్లాలో నిన్న సీఆర్పీఎఫ్ ప్ర‌యాణిస్తున్న వాహ‌నాల‌పై ఉగ్రవాదులు దాడి నిర్వ‌హించారు. ఈ దాడిలో 43 మంది జ‌వాన్లు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ దాడిని తామే చేసిన‌ట్టు జైషే మ‌హ్మ‌ద్ అనే ఉగ్ర‌వాద సంస్థ ఒప్పుకుంది.

జైషే మ‌హ్మ‌ద్ చేసిన ఈ ఉగ్ర‌దాడికి త‌గిన విధంగా స‌రైన స‌మ‌యంలో ప్ర‌తీకారం తీర్చ‌కుంటామని సీఆర్పీఎఫ్ తెలిపింది. దీనికి సంబంధించి కొద్ది సేపు క్రిత‌మే ట్వీట్ చేసింది.

Related Articles