NewsWaves.news

ప్రభుత్వం వద్దంటే పాక్ తో ఆడం : కెప్టెన్ కోహ్లీ

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు పాకిస్థాన్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భారత మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. గవాస్కర్, సచిన్ వంటి కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం ప్రపంచ కప్ లో పాక్ తో ఆడి ఆ దేశాన్ని ఓడించాలని అభిప్రాయపడ్డారు. ఈ భిన్న వాదనల నేపథ్యంలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు స్పందించారు.

“పుల్వమా ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత కెప్టెన్‌గా నాపై ఉంది. అందుకే మ్యాచ్ రద్దుపై భారత ప్రభుత్వం, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేం కట్టుబడి ఉంటాం. వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం” అని విరాట్ కోహ్లీ అన్నారు.

Related Articles