NewsWaves.news

అమర జవాన్ల రుణాలు మాఫీ : ఎస్బీఐ

జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు తమ బ్యాంకులో తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్లలో 23 మంది ఎస్బీఐలో రుణం తీసుకున్నారు. అయితే ఆ 23 మంది జవాన్లు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు వెల్లడించారు.

పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులందరూ ఎస్బీఐ కస్టమర్లే. దీంతో ఒక్కొక్క జవాన్ కు 30 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ మొత్తాన్ని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కొక్క జవాన్కు 30 లక్షల చొప్పున వారి కుటుంబాలకు అందజేయనున్నట్టు ఎస్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎస్బీఐ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

Related Articles