NewsWaves.news

ప్లాపుల్లో ఉన్న స్టార్ డైరక్ట‌ర్‌తో మాస్ మ‌హారాజా

మాస్ మ‌హారాజా ర‌వితేజా ఈ మ‌ధ్య స‌క్సెస్ కోసం వేయిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నాడు. ఒక‌ప్పుడు రవితేజా సినిమా వ‌చ్చిందంటే థియేట‌ర్లో గోల‌గోల‌గా ఉండేది. కానీ ఇప్పుడు సంద‌డి త‌గ్గింది. కిక్ దొబ్బింది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కిక్ కోసం ఎద‌రుచూస్తున్న‌ర‌వితేజా స‌రైన విజ‌యం కోసం కొత్తా పాతా అని తేడా లేకుండా మంచి క‌థ తీసుకొస్తే చాలు ఎవ‌రితో అయినా సినిమా చేయ‌డానికి రెడీ అంటున్నాడు.

ఇందులో భాగంగానే ప్ర‌స్తుతం ఫెయిల్యూర్‌లో ఉన్న వీవీ వినాయక్ తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అప్పుడే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయ‌ని స‌మాచారం. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో కృష్ణ సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయింది. సో, వీరిద్దరి కాంబినేష‌న్‌లో మ‌రో హిట్ ప‌డితే .. ఇద్ద‌రి కెరీర్‌మ‌ళ్లీ గాడిలో ప‌డుతాయేమో!

Related Articles