NewsWaves.news

ఓల్వో బస్సులో మంటలు… తప్పిన పెను ప్రమాదం..

విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న ఓల్వో బస్సు లో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్నట్టుండి మంటలు చలరేగాయి. టిఎస్ఆర్టిసికి చెందిన వోల్వో బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపివేసి బస్సులో ఉన్న ప్రయాణికులను క్రిందకు దింపాడు.

డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు పెను ప్రమాదం నుండి తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.

Related Articles