NewsWaves.news

విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ రోజు అధికారికంగా ప్రకటన చేశారు. కొత్త రైల్వే జోన్‌కు సౌత్‌ కోస్ట్‌ రైల్వేగా నామకరణం చేసారు.

విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లతో ఈ జోన్‌ ఏర్పాటవుతుందని పీయూష్ గోయల్ తెలిపారు. నూతన జోన్‌ ఏర్పాటు దిశగా అధికారిక చర్యలు చేపడతామని, జోన్‌పై ఇప్పటికే విస్తృతంగా అధ్యయనం చేశామని రైల్వే మంత్రి ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో రైల్వే మంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం.

Related Articles