NewsWaves.news

మార్చి 1న విశ్వాసం విడుద‌ల‌

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న త‌మిళ సూప‌ర్ స్టార్ అజిత్ కుమార్ న‌టించిన తాజా చిత్రం విశ్వాసం. ర‌జినీ కాంత్ సినిమా పెటాకు పోటిగా సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని సాధించింది. అయితే ఈ మూవీ తెలుగు వ‌ర్ష‌న్ విడుద‌ల విష‌యంలో ఎప్ప‌టి నుంచో జాప్యం జ‌రుగుతోండ‌గా…రీసెంట్‌గా నిర్మాత‌లు ఒక తేదీని ఖ‌రారు చేశారు. ఈ మూవీ మార్చి 1న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారని స‌మాచారం. తెలుగుతో పాటు క‌న్న‌డ‌లోనూ ఈ మూవీ విడుద‌ల కానుంది. విశ్వాసం మూవీలో న‌య‌న తారా క‌థానాయిక కాగా… జ‌గ‌ప‌తిబాబు మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శివ డైర‌క్ట్ చేశాడు.

Related Articles