NewsWaves.news

అందుకే ఓడాం : విరాట్ కోహ్లీ

నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించిన కోహ్లీ సేన.. స్వదేశంలో మాత్రం ఓట‌మికి పాలైంది. అయితే భార‌త అభిమానులు ఈ విష‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఫైన‌ల్ బాల్ వ‌ర‌కు ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజ‌యం సాధించిన త‌రువాత కోహ్లీ అలా ఎందుకు జ‌రిగిందో వివ‌ర‌ణ ఇచ్చాడు.


ఈ మ్యాచ్ ఓడిపోవ‌డానికి బ్యాటింగ్ లో వైఫ‌ల్య‌మే కార‌ణం అని చెప్పాడు. బౌర‌ల్లు చ‌క్క‌గా ఆడార‌ని.. బుమ్రా సూప‌ర్‌గా బౌలింగ్ చేశాడ‌ని..తొలి మ్యాచ్ ఆడుతున్న మ‌యాంక్ కూడా బాగా బౌలింగ్ చేశాడ‌ని త‌న టీమ్‌ను ప్ర‌శంసించాడు కోహ్లీ. అదే స‌మ‌యంలో టీ20ల్లో స్కోర్లతో నెగ్గడం చాలా కష్టమని తెలిపాడు.

Related Articles