NewsWaves.news

విన‌య “విధ్వంస” రామ రివ్యూ

న‌టీన‌టులు : రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, స్నేహ మ్యూజిక్‌: దేవీ శ్రీ ప్రసాద్‌ దర్శకత్వం : బోయపాటి శ్రీను నిర్మాత : డీవీవీ దానయ్య

రంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌టించిన సినిమా వినయ విధేయ రామ. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో దూసుకెళ్లే బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. సంక్రాంతి బ‌రిలో దిగిన ఈ మూవీ అంచ‌నాల‌ను అందుకుందా?? స‌ంచ‌నాల‌ను సృష్టిస్తుందా ?? ఈ రివ్యూ చ‌దివితే మీకే అర్థం అవుతుంది.

కథ‌ :
రామ (రామ్‌చరణ్‌)కు అన్నలంటే ప్రాణంతో స‌మానం. పెద్ద‌న్న‌ భువన్‌ కుమార్‌(ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం. త‌న జీవితం, చ‌దువును ప‌క్క‌న పెట్టి అన్న‌ల‌ను బాగా చ‌దివిస్తాడు రామ‌. భువ‌న్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా విశాఖ‌ప‌ట్నంలో ప‌ని చేస్తుండ‌గా ప‌రుశురాం ( ముఖేష్ రుషి)తో గొడ‌వ జ‌రుగుతుంది. అన్న‌ల జోలికి వ‌చ్చిన వారిని ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌ని రామ… ప‌రుశురాం మ‌నుషుల‌ను కొట్టి ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగేలా చూస్తాడు. అదే స‌మ‌యంలో బీహార్ డాన్ రాజు భాయ్ (వివేక్ ఓబెరాయ్‌) ఎన్నిక‌ల విధి విధానాల‌ను ప‌ట్టించుకోకుండా ఎన్నో త‌ప్పుడు ప‌నులు చేస్తున్నాడ‌ని భువ‌న్ కుమార్‌ను అక్క‌డికి పంపిస్తారు. అలాంటి టైమ్ లో రాజు భాయ్ ఏం చేస్తాడు ?? అన్న కోసం రామ ఏం చేశాడు? అనేదే మిగితా క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న :
రంగ‌స్థ‌లం త‌ర్వాత న‌టుడిగా ఒక మెట్టు ఎక్కిన రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీలో కూడా మంచి న‌ట‌నా కౌశ‌లాన్ని ప్ర‌ద‌ర్శించాడు. పాత్ర‌కు న్యాయం చేశాడు. యాక్ష‌న్ సీన్స్‌లో మెప్పించాడు. అయితే హీరోయిన్ కియారా అద్వానీ సినిమాలో ఎందుకుందో అనేది చాలా మందికి అర్థంకాలేదు. ప్ర‌శాంత్ పెర్ఫార్మెన్స్ బాగుంది. వ‌దిన‌గా స్నేహ హుందాగా కనిపించింది. విలన్‌గా వివేక్‌ ఒబెరాయ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి, హరీష్ ఉత్తమన్‌, రవి వర్మ, మధునందన్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు.

విశ్లేష‌ణ‌ :
రంగ‌స్థ‌లం త‌ర్వాత వస్తున్న సినిమా కావ‌డంతో విన‌య విధేయ రామ సినిమాపై అంచ‌నాలు భారీగా పెట్టుకున్నారు అభిమానులు. అయితే సినిమా యూనిట్ మాత్రం ఆ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. బోయ‌పాటి యాక్ష‌న్ సీన్స్ డోసు పెంచి ఎబ్బెట్టుగా అనిపించేలా చేశాడు. పెద్ద పెద్ద న‌టులున్నా వారిని వాడుకోలేదు అనిపిస్తుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయి. కానీ ఎలివేషన్‌ షాట్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

పాజిటివ్స్ :
రామ్‌ చరణ్ న‌ట‌న‌
కొన్ని యాక్షన్‌ సీన్స్‌

నెగెటివ్స్ :
మ్యూజిక్‌
మితిమీరిన హింస
ఫోర్స్‌డ్‌ సీన్స్‌
దర్శకత్వం

Related Articles