NewsWaves.news

మా పోరాటం వారిపైనే : విజయశాంతి

కాంగ్రెస్ పార్టీ పోరాటం జాతీయ స్థాయిలో మోడీపై, రాష్ట్రంలో కేసీఆర్ పై ఉంటుందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేసారు. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ సమావేశమైంది. ఈ సమేవేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి హాజరయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు ప్రధానంగా చర్చించారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన విజయశాంతి… మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు. రాబోయే ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని విజయశాంతి తెలిపారు.

Related Articles