NewsWaves.news

రీఎంట్రీ గురుంచి విజయశాంతి స్పందన.

చాలాకాలం తర్వాత సీనియర్ నటి విజయశాంతి మరోసారి వెండితెరపై కనిపించనున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం’ సరిలేరు నీకెవ్వరు ‘లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రారంభోత్సవం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరిగింది. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ విషయం పై విజయశాంతి స్పందించారు. ఈ సందర్భంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు.ట్విట్టర్ ద్వారా స్పందించారు.

సూపర్‌స్టార్‌ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగులో నా మొదటి సినిమా కృష్ణతో నటించిన ‘ఖిలాడీ’.. ఆ తర్వాత 150 సినిమాలు చేశాను. రాజకీయాల్లోకి వెళ్లడంతో 13 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాను. తొలి సినిమా కృష్ణతో నటిస్తే.. నా రీఎంట్రీలో మొదటి సినిమా ఆయన కుమారుడు మహేశ్‌బాబుతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద’ని విజయశాంతి పేర్కొన్నారు.అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి