NewsWaves.news

మోసం.. టీఆరెస్ నాయకత్వ నైజం : విజయశాంతి

టీఆరెస్ రాష్ట్ర నాయకత్వంలో నెంబర్ 2 స్థానంలో ఎవరు ఉన్నా.. వారికి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు టీఆరెస్ లో కీలకంగా వ్యవహరించిన ఆలె నరేంద్రను అకస్మాత్తుగా పార్టీ నుండి సస్పెండ్ చేశారని, తాను టీఆర్ఎస్ లో కీలక స్థానంలో ఉండగా తనను కూడా టార్గెట్ చేసి పార్టీ నుండి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారని… ఇప్పుడు టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు అదే పరిస్థితి ఎదురవుతుందని విజయశాంతి అన్నారు.

టీఆరెస్ నాయకత్వంలో కేసీఆర్ తరువాతి స్థానంలో ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. నాయకత్వాన్ని నమ్ముకున్న పార్టీ నేతలను తడిగుడ్డతో గొంతు కోయడం కేసీఆర్ కు పరిపాటిగా మారిందనీ.. కాలం మారినా.. దొరల నియంత పోకడ మాత్రం మారడం లేదని విజయశాంతి టీఆరెస్ అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Related Articles