NewsWaves.news

బ్రేకప్ అంటున్న విజయ్ దేవరకొండ.

అర్జున్ రెడ్డి ,గీతగోవిందం వంటి చిత్రాలతో సూపర్ స్టార్ డమ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఆయన నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు .అదిగాక ఆనంద్ అన్నామలై డైరెక్షన్ లో హీరో చిత్రాన్ని ప్రారంభించారు. కాంత్రి మాధవ్‌ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ వార్త ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ అనేకసార్లు ప్రేమ విఫలమైన బాధితుడిగా కనిపించనున్నాడట. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బ్రేకప్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవితో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన సీనియర్ నిర్మాత కె వి రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి