NewsWaves.news

వీరుల కుటుంబాల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ సాయం

జ‌మ్ముక‌శ్మీర్‌లోని పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 43 మంత్రి వీర జ‌వాన్లు అమరులైన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ మొత్తం ఉగ్ర‌దాడిని పిరికిపందెల చ‌ర్య‌గా అభివ‌ర్ణిస్తూ ఖండించింది. అదే స‌మ‌యంలో ఎంతో మంది ప్ర‌ముఖులు, సినీ తార‌లు ఈ ఉగ్ర‌దాడిపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో కొంత మంది అమ‌రుల కుటుంబాల‌ను ఆదుకోవ‌డానికి ముందుకు వ‌చ్చారు. తాజాగా హీరో విజ‌య్ దేవ‌రకొండా కూడా అమ‌రులైన సైనికుల కుటుంబాల‌ను ఆదుకోవ‌డానికి ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా భార‌త్‌కేవీర్ వెబ్‌సైట్ అందించిన ప‌త్రాన్ని చూపుతూ ట్వీట్ చేశాడు విజ‌య్‌. దేశానికి ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలిచే సైనికుల‌ను ఆదుకోవ‌డానికి అంద‌రూ త‌గిన విధంగా ఆర్థిక సాయం చేయాల‌ని కోరాడు విజ‌య్‌.

Related Articles