NewsWaves.news

లక్ష్మీస్ ఎన్టీఆర్ నుండి వీడియో సాంగ్ రిలీజ్ చేసిన వర్మ

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం” లక్ష్మీస్ ఎన్టీఆర్”. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక వీడియో సాంగ్ ని రిలీజ్ చేశాడు వర్మ. ఈ పాట ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య ఉన్న ప్రేమను వ్యక్త పరిచే విధంగా ఉండే ప్రణయ గీతం.

“నీ ఉనికి నా జీవితానికి అర్థం” అంటూ ఈ పాట ప్రారంభమవుతుంది. కాగా ఈ సాంగ్ లో మొత్తం ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే సన్నివేశాలనే చూపించాడు వర్మ. ఈ పాటను సిరాశ్రీ రచించగా, సీనియర్ సినీ నేపధ్య గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కళ్యాణ్ మాలిక్ అందించారు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related Articles