NewsWaves.news

కోడి రామ‌కృష్ణ క‌న్నుమూత

ప్ర‌ముఖ తెలుగు సినిమా ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ క‌న్నుమూశారు. నిన్నతీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఒక్క సారిగా అనారోగ్యానికి గురైన ఆయ‌న్ను గ‌చ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. నిన్న‌టి నుంచి వెంటిలేట‌ర్‌పై ఉన్న ఆయ‌న‌.. చికిత్స పొందుతూ ఈ రోజు మ‌ర‌ణించారు.

కొంత కాలం క్రిత‌మే కోడి రామ‌కృష్ణ‌కు హార్ట్ ఎటాక్, ప‌క్ష‌వాతం వ‌చ్చింది. చికిత్స త‌రువాత ఆయ‌న కోలుకున్నారు. అయితే మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం పాడవ‌డంతో ఇప్పుడు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తెలుగు సినిమాకు ముద్దుల మేన‌ళ్లుడు, శతృవు, అమ్మోరు, అరుంధ‌తి వంటి ఎన్నో హిట్స్ ఇచ్చారు కోడి రామ‌కృష్ణ‌.

Related Articles