NewsWaves.news

భారత్, పాక్ లతో చర్చలు జరుపుతాం : ట్రంప్

పుల్వామా ఉగ్రదాడి నేపద్యంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులకు రెండు దేశాలు స్వస్తి పలకాలని తాము కోరుకుంటున్నామని.. అందులో భాగంగా భారత్, పాకిస్థాన్ లతో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ ప్రకటించారు.

రెండు దేశాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, ఇప్పుడున్న సమస్యను కూడా చాలా సున్నితంగా పరిష్కరించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో అమెరికాకు.. పాకిస్థాన్ సహకరించక పోవడం వల్ల ఆ దేశానికి ప్రతి సంవత్సరం చేసే 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. 40 మంది జవాన్లను కోల్పోయిన భారత్ ఏదో ఒక కఠిన నిర్ణయాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది వ్యాఖ్యానించారు.

Related Articles