NewsWaves.news

రాజ‌కీయాల‌కు నా కుటుంబం దూరం : వెంక‌య్య నాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ రాజ‌కీయాల గురించి కీలక విష‌యాలు వెల్ల‌డించారు. త‌న కుటుంబం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటుందని తెలిపారు. త‌న‌కు రాజ‌కీయ వార‌స‌త్వంపై న‌మ్మ‌కం లేదు అనేలా త‌న కుటుంబం రాజ‌కీయాల్లోకి రాద‌ని.. స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్ నిర్వ‌హించే సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటాం అన్నారు.

నెల్లూరులో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వెంకయ్య‌నాయుడు వెంకటాచలంలో వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్టాడుతూ మాతృభాష పరిరక్షణకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఏం చేస్తామో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. ఇక నుంచి తాను ఐదు అంశాలపై దృష్టా సారిస్తానని చెప్పారు.

Related Articles