NewsWaves.news

వెల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయంలో జాత‌ర ప్రారంభం

మెద‌క్ జిల్లా, టేక్మాల్ మండ‌లం వెల్పుగొండ గ్రామంలో గుట్ట‌ల‌పై ఉన్న తుంబురేశ్వర స్వామి ఆలయంలో జాత‌ర ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈనెల 19వ తేదీ వ‌ర‌కు నాలుగురోజుల పాటు జాత‌ర ఉత్స‌వాలు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతాయి. జాత‌ర సంద‌ర్భంగా

బండ్ల ఊరేగింపు, రథోత్సవం, కుస్తీ పోటీలు తదితర కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా నిర్వ‌హిస్తారు. చుట్టుప‌క్క‌ల గ్రామాల‌నుంచి పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ఈ జాత‌ర‌కు విచ్చేస్తారు. జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles