NewsWaves.news

వర్మ కి జగన్ ఎవరో తెలియదంట…

ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా వర్మ అలాంటి పోస్ట్ ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఆ పోస్ట్ తో పాటు ఫోటో కూడా షేర్ చేశాడు వర్మ. ఆ ఫోటోలో ఫ్లైట్ లో కూర్చుని ఉన్న ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.ఆ ముగ్గురూ..వైసిపి అధినేత వైయస్ జగన్,లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డిలతో పాటు రాకేష్ కి సంబంధించిన స్నేహితుడు కూడా ఉన్నారు.

ఆ ముగ్గురు ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన వర్మ దానికింద ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు.”ఎడమ వైపున నవ్వుతూ కూర్చున్న వ్యక్తి రాకేష్ రెడ్డి. మధ్యలో కూర్చున్నది అతని స్నేహితుడు. అలాగే కుడివైపున కూర్చున్న వ్యక్తి ఎవరో మాత్రం నాకు తెలీదు”… అంటూ జగన్ ని ఉద్దేశించి పోస్ట్ చేశాడు. వర్మ ఇలా ఎందుకన్నాడో, అసలు ఈ పోస్ట్ వెనుక ఉద్దేశం ఏంటో అంటూ నెటిజన్లలో ఆల్రెడీ చర్చ మొదలయింది.

Related Articles