NewsWaves.news

ఆంజనేయుడి ఆలయాల్లో ఆకుపూజ చేసుకుని రెడీగా ఉండండి… వర్మ

తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి ఒక్కో ప్రకటన విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నాడు రామ్ గోపాల్ వర్మ.గత కొద్ది రోజుల క్రితం లవర్స్ డే రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టీజర్ ని విడుదల చేస్తానని వర్మ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా దీనికి సంబంధించి తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు వర్మ

.”ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా.. రేపు ఉదయం మీ ఇళ్లకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలలో ఆకు పూజ చేసుకొని సిద్ధంగా ఉండండి అని, ఉదయం 9 గంటల 27 నిమిషాలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ మీ ముందుకు రానుంది..

మీ కన్నీళ్లకు మాత్రం నేను బాధ్యుడిని కాదు”..అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ అటు సినీ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాలలో కూడా మరింత హీట్ ని పెంచుతోంది.

Related Articles