NewsWaves.news

బాబుక‌న్నా బాగున్నావు : రానాకు వ‌ర్మ కాంప్లిమెంట్‌

రేపు బాల‌కృష్ణ న‌టించిన మ‌హానాయ‌కుడు సినిమా విడుద‌ల కానుంది. స్వ‌ర్గీయ నందమూరి తార‌క‌రామారావు రాజ‌కీయ జీవితం ఆధారంగా ఉండ‌బోతున్న ఈ మూవీ గురించి రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్ప‌టిక‌ప్పుడు ఏదోక ట్వీట్ పెడుతూ.. త‌న సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ను ప‌రోక్షంగా ప్ర‌మోట్ చేస్తున్నాడు.

తాజాగా మ‌హానాయ‌కుడు సినిమాలో చంద్ర‌బాబు పాత్రలో న‌టిస్తున్న రానా ఫొటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు వ‌ర్మ‌. దీనికి రానా ద‌గ్గుబాటిని ట్యాగ్ చేసి.. బాబు క‌న్నా బాగున్నావు అంటూ చమ‌త్క‌రించాడు.

ఇక్క‌డ విశేషం ఏంటంటే రానా కూడా వ‌ర్మ‌కు రిప్లై ఇచ్చాడు. వ‌ర్మ ప్ర‌శంస‌కు పొంగిపోయిన రానా థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చాడు.

Related Articles