NewsWaves.news

వ‌ర్మ పెట్టిన పోల్‌లో మ‌హానాయ‌కుడు ఢ‌మాల్‌!!

మ‌హానాయ‌కుడు సినిమా తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోండ‌టంతో.. ఆమూవీకి పోటీగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెర‌కెక్కిస్తోన్న రామ్ గోపాల్ వ‌ర్మ నిన్న ట్విట్ట‌ర్‌లో ఒక పోలింగ్ పెట్టాడు.

మ‌హానాయకుడు నాయ‌కుడు , లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మ‌ధ్య‌లో ఒక‌దానికి ఓటు వేయ‌మ‌ని ట్వీట్ చేశాడు. అయితే ఈ పోల్ ఏదో స‌ర‌దాకి పెట్టినా.. దాని ఫ‌లితాలు మాత్రం బాల‌య్య అభిమానుల‌ను షాక్‌కి గురిచేశాయి.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ .. మ‌హానాయ‌కుడు సినిమా క‌న్నా ఎక్కువ‌గా నిజాయితీ ఉన్న సినిమా అని.. 85 శాతం మంది ఒప్పుకున్నారు. మ‌హానాయకుడు మూవీలో నిజాయితీ ఉంద‌ని కేవ‌లం 15 శాతం మంది మాత్ర‌మే న‌మ్మారు. దీంతో స‌త్య‌మే గెలిచింది అంటూ మ‌ళ్లీ ట్వీట్ చేశాడు వ‌ర్మ‌!

Related Articles