NewsWaves.news

వంకాయ పచ్చి పులుసు

ఉదయం నుండి ఆఫీస్ లో కష్టపడి ఇంటికిరాగానే అందరికి ఇష్టంగా వంటచేసి రుచిగా వండిపెట్టాలని చాల మంది అనుకుంటూ వుంటారు . కాస్త త్వరగా అయిపోయే వంటకం గురించి ఆలోచించే వారికి ఈ రెసిపీ ఉపయోగపడుతుంది … ఏంటో తెలుసా వంకాయ పచ్చి పులుసు….


కావలసిన పదార్థాలు : వంకాయ ,చింతపండు ,ఆవాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ,ఎండు మిర్చి, నూనె కొద్దిగా, ఉప్పు, పచ్చిమిర్చి .తయారు చేసే విధానం ముందుగా చింతపండు కొద్దిగా నీళ్లలో కడిగి పక్కన పెట్టుకోవాలి.కడిగిన చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి .తరువాత వంకాయ కి నూనె రాసి స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్ గా స్టౌ మీద పెట్టి బాగా మగ్గే వరకు ఉంచాలి .

కాస్త చల్లారిన తర్వాత వంకాయ మీద ఉన్న తొక్కను తీసేసి ముక్కలుగా చేసుకోవాలి ఆల్రెడీ వంకాయ కి నూనె రాశాం కాబట్టి చాలా ఈజీగా వంకాయ పైన ఉండే తొక్క వచ్చేస్తుంది .అలాగే స్టౌ మీద పాన్ పెట్టి వేడి న తర్వాత కొద్దిగా నూనె వేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తరువాత తీసి మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి . ఒక గిన్నె తీసుకుని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం అలాగే కాల్చిన వంకాయ ను అందులో వేసుకుని మెత్తగా కలుపుకోవాలి.తర్వాత పేస్ట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి పేస్ట్ ను ,తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి .

అందులో కొద్దిగా నీళ్లు వేస్తూ కావలసినంత పలుచగా చేసుకోవాలి .స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి వేగిన తర్వాత తయారుచేసి పెట్టుకున్న పచ్చి పులుసు లో పోపు వేసుకోవాలి .అంతే టేస్టీ గా ఉండే వంకాయ పచ్చి పులుసు రెడీ .

Related Articles