NewsWaves.news

రెండో రోజే ఆగిపోయిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

ప్ర‌ధాన మంత్రి మోదీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రెండో రోజే బ్రేక్ డౌన్ అయింది. అత్యంత వేగంగా వెళ్లే ఈ రైలు ఇవాళ ఉద‌యం వార‌ణాసి నుంచి ఢిల్లీకి వెళ్తుండగా తుండ్లా స్టేష‌న్ వ‌ద్ద ఆగిపోయింది. దీనికి కారణం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ ఒక ఆవును ఢీకొట్ట‌డ‌మే. దీంతో సాంకేతిక స‌మ‌స్య‌లు రావ‌డంతో తుండ్లా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద సుమారు 3 గంట‌ల పాటు ట్రైన్‌ను ఆపేశారు. ఒకే సారి అన్ని బ్రేకులు ప‌ట్టేయ‌డం.. త‌ర్వాత బ్రేక్‌ల నుంచి దుర్వాస‌న రావ‌డంతో ట్రైన్‌ను ఆపేశారు లోకోపైలెట్లు. ఈ ఆదివారం నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ వాణిజ్య సేవ‌లు మొద‌లు అవుతాయి

Related Articles