NewsWaves.news

గంటా 20 నిమిషాలు ఆల‌స్యంగా వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌

ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు ఆది నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాణిజ్య సేవ‌లు ప్రారంభం కావ‌డానికి రెండు రోజుల ముందు ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరిన వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ మ‌ధ్య‌లో ఒక ఆవును ఢీకొంది. దీంతో బ్రేకులన్నీ ప‌ట్టేసుకోవ‌డంతో మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అందులో ప్ర‌యాణిస్తున్న అధికారులు, జ‌ర్న‌లిస్టుల‌ను వేరే ట్రైన్‌లో త‌ర‌లించారు. ఆదివారం రోజు వాణిజ్య సేవ‌ల ప్రారంభించిన వందేభార‌త్ ఎక్స్ ప్రెస్‌… అనుకున్న స‌మ‌యంక‌న్నా గంటా 20 నిమిషాలు లేట్‌గా గ‌మ్య‌స్థానానికి చేరుకుంది. దీంతో భార‌త దేశంలోనే అత్యంత వేగ‌వంత‌మైన ట్రైన్ అనుకొని ఎక్కిన ప్ర‌యాణికుల‌కు నిరాశేమిగిలింది. దీనిపై స్పందిచిన ల‌క్నో- వార‌ణాసి రైల్వే అధికారి.. దారి మ‌ధ్య పొగ‌మంచు అధికంగా ఉండ‌టం వ‌ల్లా ఇలా ఆల‌స్యం అయింద‌ని చెప్పారు.

వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ నుంచి వార‌ణాసి మ‌ధ్య‌లో ప్ర‌యాణిస్తుంది. ఈ ట్రైన్‌ను ట్రైన్ 18 అని కూడా అంటారు. గ‌త శుక్ర‌వారం రోజు ప్ర‌ధాని మోదీ దీన్ని ప్రారంభించారు.

Related Articles