NewsWaves.news

వార‌ణాసిలో ప‌సుపు రైతుల నామినేష‌న్

నిజామాబాద్  జిల్లాలోని  పసుపు రైతులు  త‌మ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్య‌క్ష పోరుకు సిద్ధ‌మ‌య్యారు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల‌లో పోటీచేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై పోటీ చేయాల‌ని సంక‌ల్పించారు.  ప‌సుపుపంట‌కు గిట్టుబాటు  ధ‌ర‌లు ల‌భించ‌డంలేద‌ని, జిల్లాలో  ప్రాంతీయ  ప‌సుపు బోర్డు  ఏర్పాటు చేయాల‌ని ఎప్ప‌టినుంచో కోరుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ఆరోపిస్తున్నారు.

 నిజామాబాద్  జిల్లాలోని ఆర్మూర్, బాన్స్ వాడ త‌దితర ప్రాంతాల‌కు చెందిన దాదాపు 50 మంది ప‌సుపు  రైతులు వార‌ణాసి  వెళ్ళారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు.  పసుపు రైతుల సంఘం జాతీయ అధ్య‌క్షుడు  దైవ శిగామణీ, రాష్ట్ర అధ్య‌క్షుడు కోటపాటి నర్సింహ నాయుడు   త‌దిత‌రులు ప‌సుపు రైతుల‌కు   త‌మ మ‌ద్ద‌తు  ప్రకటించారు. 14 mins

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి