NewsWaves.news

కెసిఆర్ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారతాయి… మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ సీఎం కెసిఆర్.. ప్రధానమంత్రి కావాలని తాను తిరుపతి వెంకన్నకి మొక్కుకున్నానని తెలిపారు తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్.నేడు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసగౌడ్ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో అమలవుతున్న పథకాల అమలు చేస్తున్నాయని, అలాంటి కేసిఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం రూపురేఖలు మారిపోతాయని ఆయన అన్నారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 16 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని,దాంతో మరింత బలం చేకూరుతుందని ఆయన అన్నారు.

రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే ఆబ్కారీ శాఖను ముఖ్యమంత్రి తనకు కేటాయించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, సీఎం ఆదేశాల మేరకు తాను ఒక సైనికుడిలాగా పని చేస్తానని, ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయనని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.అక్రమ మధ్యమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని, గుడుంబాని నిషేధిస్తామని, అలాగే గుడుంబాని తయారు చేస్తున్న వారికి ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

Related Articles