NewsWaves.news

టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ దాదాపుగా ఖరారైంది. మార్చి 10వ తేదీన లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తులను అనుమతిస్తారు. లేట్ ఫీజుతో మే 16 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో న్యాయవిద్యకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లా ప్రవేశ పరీక్షకు పోటీ కూడా తీవ్రమవుతోంది. న్యాయ విద్యను అభ్యసించడానికి ప్రస్తుతం 3 సంవత్సరాల, 5 సంవత్సరాల కోర్సులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

Related Articles