NewsWaves.news

తెలంగాణ క్యాబినెట్ తొలి సమావేశం

మంత్రివర్గ విస్తరణ అనంతరం తెలంగాణ క్యాబినెట్ తొలిసారి భేటీ కానుంది. ఈరోజు సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో క్యాబినెట్ సమావేశం కానుంది. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మంత్రివర్గం సమావేశం అవుతున్నట్లు సమాచారం.


ఇటీవల రాజ్ భవన్ లో 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ వారికి పలు శాఖలను అప్పగించారు. అయితే ఆర్థిక శాఖ, ఐటీ, నీటిపారుదల వంటి పలు కీలక శాఖలను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. ఆర్థిక శాఖ తన దగ్గరే ఉండటంతో రాష్ట్ర బడ్జెట్ ను కేసీఆర్ ప్రవేశపెడతారు.

Related Articles