NewsWaves.news

అమెరికాలో ఎమర్జెన్సీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమెరికా సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసలను నిరోధించేందుకు అమెరికా,మెక్సికో దేశాల మధ్య సరిహద్దు గోడ నిర్మిస్తామని ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు.


అధికారం చేపట్టిన నాటి నుండి ట్రంప్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అయితే మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోడ నిర్మాణానికి అవసరమయ్యే నిధుల మంజూరుకు సంబంధించిన బిల్లును ఆమోదించేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది.

ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన కారణంగా కొన్ని రోజుల క్రితం అమెరికాలో షట్ డౌన్ నెలకొంది. అనంతరం షట్ డౌన్ ఎత్తివేసినప్పటికీ సరిహద్దు గోడ నిర్మాణంపై పట్టుదలతో ఉన్న ట్రంప్ అమెరికాలో ఎమర్జెన్సీని విధించారు. తన నిర్ణయంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని, కానీ అంతిమంగా తమదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Related Articles