NewsWaves.news

మా పథకాలే కాపీ కొట్టారు.. కేటీఆర్

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలనే బీజేపీ, కాంగ్రెస్ కాపీ  కొడుతున్నాయని, ఆ రెండు పార్టీలు మానిఫెస్టోలో తెరాస అమలుచేస్తున్న సంక్షేమ పథకాలనే కాపీ కొట్టి గొప్పలు చెప్పుకుంటున్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు  పలు ప్రశంసలు అందుకుంటున్నాయని అయన చెప్పారు. ఎల్బీనగర్‌ పరిధిలోని మన్సురాబాద్‌ డివిజన్‌లో మన హైదరాబాద్‌.. మనందరి హైదరాబాద్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ ప్రసంగించారు.

గత  ఐదేళ్లలో  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందని, దేశవ్యాప్తంగా  తమ ప్రభుత్వానికి ప్రశంసలు అందుతున్నాయని అయన చెప్పారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ సహా 8 రాష్ర్టాలు రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి అమలు చేస్తున్నాయని కేటీఆర్‌  విమర్శించారు.

ప్రధాని  మోడీ చెబుతున్న   కిసాన్‌ పథకానికి ప్రేరణ తమ  రైతుబంధు పథక మేనని   ఆయన గుర్తు చేశారు, మా పథకాలే కాపీ కొట్టి ఏమీ చేయట్లేదని మమ్మల్నే విమర్శించడం సరికాదన్నారు. పలువురు మంత్రులు, పార్టీ నాయకులు  ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.       

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి