NewsWaves.news

గుప్తనిధుల కోసం వెళ్లిన మరో వ్యక్తి కూడా మృతి.

గుప్తనిధుల వేటలో ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వెళ్లారు.ఇప్పటికే బ్యాంక్ ఉద్యోగి శివ కుమార్ మృత దేహాన్ని పోలీసులు తీవ్రంగా గాలించి కనుగొన్నారు.అయితే మరో వ్యక్తి హనుమంత నాయక్ మృతదేహాన్ని కూడా కనుగొన్నారు.ముగ్గురిలో ఒకరు ప్రాణాలతో బయట పడ్డారు.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన హనుమంతునాయక్‌ (65), కృష్ణానాయక్‌ (40), హైదరబాద్‌ కెనరా బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న కట్టా శివకుమార్‌ (39) గుప్త నిధుల కోసం తర్లుపాడు వచ్చారు. మండలంలోని తాడివారిపల్లి గ్రామ సమీపంలోని నందనవనం పాత శివాలయం ఎదురుగానే పాండురంగ స్వామి దేవాలయానికి వెళ్లేందుకు ఈనెల 12వతేదీ రాత్రి అడవిలోకి ప్రవేశించారు. అడవిలో దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించారు. నాలుగు కొండలు దాటిన తరువాత మల్లప్పశల వద్దకు చేరుకున్నారు. భానుడి ప్రతాపానికి విలవిలలాడిపోయారు. వెంట తెచ్చుకున్న నీళ్లు, మజ్జిగ అయిపోవడంతో తాగునీటి కోసం తలోదిక్కు వెళ్లారు.

ముగ్గురూ అడవిలో తప్పిపోయారు. గురువారం శివకుమార్‌ మృతదేహాన్ని గుర్తించారు. హనుమంతరావునాయక్‌ అచూకీ లభించలేదు. దర్శి డీఎస్పీ నాగరాజు, సీఐ చిన్న మీరాసాహెబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మర గాలింపు చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు హనుమంతు నాయక్‌ (65) మృత దేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి