NewsWaves.news

పెళ్లిళ్ల‌ల్లో సాధార‌ణంగా చేసే పొర‌పాట్లు ఇవే!

జీవితంలో అతి ప్ర‌ధాన ఘ‌ట్టాల్లో పెళ్లి ఒక‌టి . జీవితాంతం జ్ఞాప‌కం ఉండేలా పెళ్లి చేసుకోవాల‌ని త‌హ‌త‌హలాడుతుంటారు. ఎన్నో అరేంజ్‌మెంట్స్‌, వంద‌లాది మంది గెస్ట్‌ల మ‌ధ్య‌.. అంత‌రంగ వైభ‌వంగా పెళ్లి జ‌ర‌గాల‌ని క‌లలు కంటారు. పెళ్లి అంటే ఆ మాత్రం ఉత్సాహం ఉండాలి క‌దా. అయితే కొన్ని సార్లు ఉత్సాహం ఉనికికే ప్ర‌మాదం తెస్తుంది. పెళ్లిళ్లో చేసే చిన్న చిన్న పొప‌పాట్ల వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు వ‌స్తుంటాయి. అలాంటి కొన్ని పొర‌పాట్లు ఇవే…

1 ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం


దీనివలన కలిగే నష్టం

అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం

2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం ( వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)


(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం‌ ఆచరించాకే మిగతావి)దీనివలన కలిగే నష్టం
వారిమధ్య ప్రేమ లోపించటం

3.ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం

దీనివలన కలిగే నష్టం
సంస్కారం లోపించటం

4. తలబ్రాలకి బదులు థర్మాకోల్ , రంగుల గుండ్లు పోసుకోవటం

దీనివలన కలిగే నష్టం
బంధు ద్వేశం ఆర్దిక ఇబ్బదులు

5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం

దీనివలన మంటపంలొ ఉండే దేవతలు వెళ్లిపొయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం

6. బఫే భోజనాలు


దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం

7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం

దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్షంగా నిలవండి

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి