NewsWaves.news

టొమాటో రైస్

కావలసిన పదార్ధాలు : టొమాటో ముక్కలు 2 కప్పులు, జీర హాఫ్ స్పూన్, ఆవాలు హాఫ్ స్పూన్, మినుములు హాఫ్ స్పూన్, పచ్చి శనగపప్పు హాఫ్ స్పూన్, జీడిపప్పు 50 గ్రాములు, నూనె 4 స్పూన్లు, కరివేపాకు , అల్లం ముక్కలు హాఫ్ స్పూన్, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన అన్నం కావలసినంత.

తయారుచేసే విధానం:
స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఎండుమిర్చి వేసి కాస్త వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చి శనగపప్పు,మినప్పప్పు వేసి బాగా వేగనివ్వాలి .తర్వాత జీడిపప్పు వేసి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసి బాగా కలపాలి, తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి.

కాస్త వేగితే సరిపోతుంది తర్వాత టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి .టొమాటో సగం ఉడికేవరకు ఉంచాలి తర్వాత కావాలనుకున్నా వాళ్లు కాస్త గరం మసాలా వేసుకోవచ్చు. దానితో పాటు కొత్తిమీర వేశాక , ఉడికించిన అన్నం వేసి రెండు నిమిషాల‌య్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో కి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి… అంతే రుచికరమైన టొమాటో రైస్ రెడీ…

Related Articles