NewsWaves.news

తిరుప‌తి కిరిటాలు ఏమ‌య్యాయి గోవిందా!?

తిరుమల తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తుల విగ్రహాలకు అలంకరించిన మూడు బంగారు కిరీటాలు చోరి అయిన విష‌యం తెలిసిందే. చోరీ జ‌రిగి మూడు వారాలు కావొస్తోన్నా…పోలీసులు వాటి జాడ క‌నుక్కోలేక‌పోతున్నారు. ఈ వ్య‌వ‌హ‌రం టీటీడీకి మరో మాయని మచ్చగా మిగిలిపోయింది. విచార‌ణ‌లో భాగంగా పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ ఆలయ అర్చకులు, సిబ్బందిని విచారించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్, తమిళనాడుకు చెందిన మరి కొందరిని ఆదుపులోకి తీసుకున్నారు. మొత్తం 27 మందికి పైగా విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో తమిళనాడుకు చెందిన మత్తయ్య ఒకరు.

మాయం చేసిన కిరీటాలను దొంగలు విక్రయించినట్లు సమాచారం. తిరుపతిలోని ఓ బంగారు వ్యాపారస్తుడికి విక్రయించడం, అతను ఇతర ప్రాంతాలకు తరలించి కరిగించడం కూడా పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, టీటీడీ విచారణలో విషయం బయటపడడంతో బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

Related Articles